మాగుంటకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆకుపాటి
కనిగిరి సాక్షిత:
కనిగిరి నియోజకవర్గం పామూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, పామూరు రెండవ ఎంపీటీసీ సభ్యులు, ప్రకాశం జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు ఆకుపాటి వెంకటేష్ గురువారం ఒంగోలు పార్లమెంటు సభ్యులు మా గుంట శ్రీనివాసులు రెడ్డికి దుశ్యాలవతో సన్మానించి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి చిత్రపటంతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆకుపాటి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, పార్లమెంటు సభ్యులుగా ప్రకాశం జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇటువంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా యువజన నాయకులు మా గుంట రాఘవరెడ్డి, ఇండ్ల నరసింహారావు, పుప్పాల రామమూర్తి, తదితరులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
