కలిగిరి కొండపై శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
** తిరుమల తేదీల్లోనే ఇక్కడ కూడా…
సాక్షిత ప్రతినిధి – పెనుమూరు / తిరుపతి: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కలిగిరి కొండపై కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 24 నుంచి అక్టోబర్ 02వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 23న సాయంత్రం 06గం.ల నుంచి 08 గం.ల వరకు అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 24వ తేదీ బుధవారం ఉదయం 10.15 గం.ల నుండి 11.15 గం.ల వరకు వృశ్చిక లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో ఉదయం 08గం.ల నుంచి 09 గం. వరకు, తిరిగి రాత్రి 07 గం.ల నుంచి 08 గం.ల వరకు వాహన సేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
24న రాత్రి శేష వాహనం,
25న ఉదయం తిరుచ్చి ఉత్సవం, రాత్రి హంస వాహనం, 26న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం,
27న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వ భూపాల వాహనం, 28న ఉదయం మోహినీ ఉత్సవం, రాత్రి గరుడ వాహనం, 29న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం, 30న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, అక్టోబర్
01న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 02న ఉదయం చక్రస్నానం అనంతరం ధ్వజావ రోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి. కాగా ఈనెల 27వ తేదీ ఉదయం 11 గం.ల నుండి 01 గం.ల వరకు కల్యాణోత్సవం జరుగనుంది. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ , అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
