మోదీ రాకతో అభివృద్ధి మరింత పరుగులు
** టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్
సాక్షిత ప్రతినిధి – చిత్తూరు: రాష్ట్రంలోని కర్నూలులో గురువారం (నేడు) జరిగే శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు హాజరు కానున్న ప్రధాని మోదీ రాకతో అభివృద్ధి మరింత పరుగులు పెడుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ తెలిపారు. సాయంత్రం ఆయన చిత్తూరులోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినతి మేరకు కర్నూలులో ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా రూ.13,430 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు అభివృద్ధి కానుకలు అందించ నున్నారు. వాటిలో రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక, రహదారి, రైల్వే రంగాల అభివృద్ధికి ఊతమిచ్చే పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి పర్యటన వివరాలను పీఎంవో అధికారికంగా ప్రకటించింది. పలు విభాగాల ప్రాజెక్టులు ఉండగా, ఇవి రాష్ట్రాభివృద్ధికి కీలక మలుపుగా నిలుస్తాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
కర్నూలు–3 పూలింగ్ స్టేషన్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ – రూ.2,880 కోట్లు, కర్నూలు జిల్లా అభివృద్ధి ప్రణాళికలో భాగంగా, రూ.2,880 కోట్ల వ్యయంతో కర్నూలు–3 పూలింగ్ స్టేషన్ అనుసంధాన ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు రాయలసీమలో విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే పారిశ్రామిక కారిడార్లు – రూ.4,920 కోట్లతో ఓర్వకల్, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి పనులకు, అలాగే పాపాఘ్ని నదిపై వంతెనకు, ఎస్.గుండ్లపల్లి–కనిగిరి బైపాస్ రహదారికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులను నిక్ డిట్, ఏపీ ఐఐసీ సంయుక్తంగా అమలు చేస్తాయి. ఈ రెండు కారిడార్లు పూర్తయితే సుమారు రూ.21,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించనున్నాయి. అంతేకాకుండా లక్ష మందికి పైగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. రాయలసీమ పారిశ్రామిక వృద్ధికి ఇది కీలక దశగా నిలుస్తుంది.
రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులు
సబ్బవరం – షీలానగర్ గ్రీన్ ఫీల్డ్ రహదారి: రూ.960 కోట్ల వ్యయంతో నిర్మాణం ప్రారంభం. పీలేరు – కాలూరు నాలుగు లేన్ల విస్తరణ: రూ.1,140 కోట్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన. గుడివాడ – నుజెళ్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా శ్రీకారం.
వీటితో పాటు అనేక
రైల్వే ప్రాజెక్టులు, రోడ్డు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
