జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ , డిఆర్ఓ, వ్యవసాయ, హార్టికల్చర్ మరియు ప్రణాళిక శాఖ అధికారులు సమీక్ష సమావేశం

Sakshitha news

జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ గారు, డిఆర్ఓ, వ్యవసాయ, హార్టికల్చర్ మరియు ప్రణాళిక శాఖ అధికారులు సమీక్ష సమావేశంలో హాజరయ్యారు.

ముందుగా అన్నమయ్య జిల్లాతో కలుపుకొని మొత్తం 4 జిల్లాలను ” ప్రధాన మంత్రి ధన – ధాన్య కృషి యోజన ” క్రింద దేశంలో ప్రకటించిన ప్రకటించిన 100 జిల్లాలో పరిగణలోకి తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.

” ప్రధాన మంత్రి ధన – ధాన్య కృషి యోజన ” పథకం 2025 – 26 బడ్జెట్ లో సంవత్సరానికి 24 వేల కోట్ల రూపాయిల కేటాయింపు చొప్పున రాబోయే 6 సంవత్సరాలు నిధులు కేటాయించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారు ప్రకటించారు.

” ప్రధాన మంత్రి ధన – ధాన్య కృషి యోజన ” క్రింద అన్నమయ్య జిల్లా, సత్య సాయి జిల్లా, అనంతపురం జిల్లా మరియు అల్లూరి సీతారామ జిల్లాను కలుపుకొని 4 జిల్లాలను ప్రకటించడానికి చొరవ చూపి కేంద్ర ప్రభుత్వంను ఒప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతఙ్ఞతలు.

” ప్రధాన మంత్రి ధన – ధాన్య కృషి యోజన ” పథకం 100 ” ఆకాంక్షితా వ్యవసాయ జిల్లాలో ” సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అమలు చేయాలని కేంద్రప్రభుత్వం 2025 బడ్జెట్ లో ప్రకటించింది.

ప్రతి రాష్ట్రంలో వ్యవసాయంలో తక్కువ ఉత్పాదకత, క్లిష్టతర వ్యవసాయ పరిస్థితులు మరియు సగటున తక్కువ వ్యవసాయ రుణాలు తీసుకొనే పరిస్థితులు ఉండే కనీసం ఒక జిల్లాను ” ఆకాంక్షితా వ్యవసాయ జిల్లా” గా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, మన రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాకు అవకాశం లభించింది

” ఆకాంక్షితా వ్యవసాయ జిల్లా ” లక్ష్యాలు 1) వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, 2 ) వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పంటల మార్పు మరియు సానుకూల వ్యవసాయ పద్దతులను అనుకరించేలా చేయడం, 3) పంచాయితీ మరియు బ్లాక్ స్థాయిలో పంట కోత అనంతరం పంట నిల్వకు అవసరమైన చర్యలు, 4) నీటివనరుల లభ్యతను పెంచడం మరియు 5) స్వల్ప మరియు దీర్ఘకాలిక రుణాల లభ్యత.

అలాగే, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రోత్సాహం, నైపుణ్య శిక్షణ, రాష్ట్రప్రభుత్వం ద్వారా జిల్లా, మండల, గ్రామ, వార్డు స్థాయిలో పని చేయవలసిన అధికారుల కొరత లేకుండా చూడడం, ప్రత్యేక ప్రాజెక్టులను గుర్తించడం, వ్యవసాయ సంబంధిత అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి అమలు చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం.

కేవలం వ్యవసాయ శాఖ మాత్రమే కాకుండా గ్రామీణ అభివృద్ధి , సహకార , ఫుడ్ ప్రాసెసింగ్ , పరిశ్రమలు, పశుసంవర్ధక మరియు పాడి , మత్స్య , ఐ సి ఏ ఆర్ , నీతి ఆయోగ్ , నాబార్డ్ తదితర శాఖలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆకాంక్షితా వ్యవసాయ జిల్లాలో రైతుల జీవితాలను మెరుగు పరచడానికి కేంద్ర ప్రభుత్వం ” ప్రధాన మంత్రి ధన – ధాన్య కృషి యోజన ” ప్రవేశ పెట్టింది.

వివిధ శాఖలలో ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను అనుసంధానం చేసి అత్యుత్తమ ఫలితాలు పొందే విధంగా కార్యాచరణ ” ప్రధాన మంత్రి ధన – ధాన్య కృషి యోజన ” జరగబోతుంది.

మొత్తం 11 శాఖలకు సంబందించిన 36 కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలను జోడించి 73 సూచికలలో కనీసం 46 సూచికల ఫలితాలను రాబట్టే విధంగా ” ప్రధాన మంత్రి ధన – ధాన్య కృషి యోజన ” అమలు జరుగుతుంది.

ముఖ్యంగా అన్నమయ్య , సత్య సాయి , అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలను వెనుకబాటుతనం ఆధారంగా ” ఆకాంక్షిత జిల్లాలు” గా పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని, కుదరకపోతే రాజస్థాన్ ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లాలుగా లేక ఈ జిల్లాలో కొన్ని ప్రాంతాలను ఆకాంక్షిత బ్లాకులుగా గుర్తించి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని 31 జులై 2025 న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది, అదే లేఖను కేంద్ర ప్రభుత్వానికి మరియు నీతి ఆయోగ్ కు పంపడం జరిగింది.

రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లు మరియు వివిధ శాఖల సమీక్ష అనంతరం, 7 జులై 2025 న ఆకాంక్షిత జిల్లాలు మరియు బ్లాకుల పైన దృష్టి పెడతామని అన్ని జిల్లాల సమీక్షల పర్యటన అనంతరం వచ్చిన సమాచార పరిశీలన అనంతరం ఆరోజున అన్నమయ్య, సత్యసాయి మరియు ప్రకాశం జిల్లాల వెనుకబాటుతనం ఆధారంగా ఆకాంక్షిత జిల్లాలుగా పరిగణించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ ఇవ్వడం జరిగింది, రాజస్థాన్ స్టడీ టూర్ అనంతరం ఈ జిల్లాతో పాటు అనంతపురం మరియు చిత్తూరు జిల్లాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని తెలపడం జరిగింది.

మా లేఖల స్పందనతో వికసిత్ భారత్ లో భాగస్వామ్యం చేయడానికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతో ప్రధాని నరేంద్ర మోడీ గారికి చేసిన విన్నపం కార్యరూపం దాల్చి రేపు ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆకాంక్షిత వ్యవసాయ జిల్లాలో అమలు చేయబోతున్న ” ప్రధాన మంత్రి ధన – ధాన్య కృషి యోజన ” మన రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా, సత్య సాయి జిల్లా, అనంతపురం జిల్లా మరియు అల్లూరి సీతారామ జిల్లాల రైతులకు శుభాభివందనాలు తెలుపుతున్నాము.

” ప్రధాన మంత్రి ధన – ధాన్య కృషి యోజన ” ను జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ కమిటీలను ఏర్పాటు చేసి పథకం అమలును పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఈ కమిటీలు ఈ పథకం ఏ ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆయా జిల్లాలో ఆ ఉద్దేశ్యంకు అనుగుణంగా అమలు జరిగేలా చూడాలి.

నేను ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లానే ఏందుకు ఏంచుకున్నాను అంటే ….

10 జనవరి 2025 న ఇదే రాయచోటిలోని కలక్టరేట్ నందు మొట్టమొదటి సారి వివిధ ప్రభుత్వ పథకాలు మరియు ప్రాజెక్టుల పైన సమీక్ష చేసినప్పుడు ఈ ప్రాంతం దయనీయ స్థితి అర్ధం అయ్యింది. అనంతరం
నాలుగు సందర్భాలలో ( సెక్రటేరియట్ లో 7 జులైన విలేకరుల సమావేశంలో, 28 జులై కడప ఆకాంక్షిత జిల్లా సమీక్ష సమావేశంలో, 31 జులైన ముఖ్తమంత్రి గారికి లేఖ రాసిన సందర్భంలో, 8 సెప్టెంబర్ రాజంపేట పర్యటన సందర్భంగా ఒక వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో …) ఆకాంక్షిత జిల్లాగా అన్నమయ్య జిల్లాను ప్రకటించవలసిన అవసరం ఉందని చెప్పడం జరిగింది, దానికి కారణం ఈ ప్రాంత భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితుల ప్రతికూలత ఇక్కడ ప్రజల జీవనం పైన ప్రభావం చూపుతుంది మరియు ఈ ప్రాంతం నుండి ముఖ్యమంత్రులు వచ్చినా వారి కుటుంబాలు బాగు పడ్డాయి కానీ ప్రజల జీవితాలు బాగుపడలేదు. ఇక్కడ నుండి మూడుసార్లు గెలిచిన ఎంపీ ఈ జిల్లా అభివృద్ధి కాకుండా లిక్కర్ స్కామ్ లో మునిగిపోయారు. కాబట్టి ఈ ప్రాంత దయనీయ స్థితిని ప్రభుత్వం దృష్టికి తేవాలని భావించాను.

డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చేయగలదనే అంశం ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన మేము రాసిన లేఖలు, వాటికి స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ప్రతి స్పందించి ఈ జిల్లాలో ” ప్రధాన మంత్రి ధన – ధాన్య కృషి యోజన ” ను అమలు చేయడానికి “ ఆకాంక్షిత వ్యవసాయ జిల్లా “ గా గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే.