ఆరు గ్యారెంటీల మాదిరిగానే బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
బీసీల మనోభావాలు ఆత్మగౌరవాన్నీ అగౌరవపరిచిన కాంగ్రెస్
బీసీ రిజర్వేషన్ల కోసం బిఆర్ఎస్ ఎప్పుడు పోరాడుతుంది
మాజీ రాజ్యసభ సభ్యులు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్
సూర్యాపేట జిల్లా ప్రతినిధి : స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో పరోక్షంగా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని మాజీ రాజ్యసభ సభ్యులు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ ఒక ప్రకటనలో అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 50 సంవత్సరాలుగా బీసీలకు బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమని కోర్టులో జీవో 9 నిలబడదని తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం నటించిందన్నారు. ఆర్టికల్ 9 సవరించి పార్లమెంటులో అనుమతి వస్తే తప్ప ఇది సాధ్యం కాదని బిఆర్ఎస్ మొదటి నుంచి చెబుతుందన్నారు. బిసి రిజర్వేషన్లు ఇచ్చామని ఏదో పోరాడమని చెప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నటించిందని అన్నారు. కోర్టు స్థానిక సంస్థల నోటిఫికేషన్ నిలిపివేసిందని దీనికి ప్రధాన ముద్దాయి కాంగ్రెస్ అన్నారు. ఆరూ గ్యారంటీల మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో బీసీల మనోభావాలను ఆత్మ గౌరవాన్ని అగౌరవపరిచిందన్నారు. నోటిఫికేషన్ వెలువడటంతో ఎంతో మంది బీసీ అభ్యర్థులు డబ్బులు పోగొట్టుకున్నారని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. బిఆర్ఎస్ మొదటి నుంచి చెబుతున్నట్లుగానే 42% రిజర్వేషన్లు వచ్చేందుకు పోరాడుతుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్ సిద్ధంగా ఉంటుందన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
