ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిలకలూరిపేట జనసేన పార్టీ నియోజకవర్గ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ
సాక్షిత చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మండలనేని చరణ్ తేజ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చరణ్ తేజ మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, పట్టుదలతో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను సమతూకం చేస్తూ ముందుకు సాగుతున్న చంద్రబాబు పనితీరు అభినందనీయమని కొనియాడారు.
రాష్ట్రానికి భారీగా పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకువస్తూ ప్రగతి పథంలో నడిపిస్తున్న ఆయన నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.అదేవిధంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారధ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అగ్రపథాన నిలుపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీరిద్దరి కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చరణ్ తేజ తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY