ప్రశాంతమైన పాటూరులో నీ రాజకీయాలు చేయొద్దు

Sakshitha news

ప్రశాంతమైన పాటూరులో నీ రాజకీయాలు చేయొద్దు

పాటూరు తిక్కన పుట్టిన ఎంతో ప్రశాంతమైన గ్రామం..

రాజకీయాలు ఆ వారం రోజులే అందరం కలిసికట్టుగా ఉంటాం

అభివృద్ధి కనబడకపోతే నీకు కొరియర్ పంపిస్తున్నాం చూసుకో..

మల్లారెడ్డి పై వైసీపీ నేతలు మండిపడ్డారు..

టిడిపి నేత ఇంతా మల్లారెడ్డి ఏదైనా ఉంటే కోవూరులో చూసుకోవాలి గాని పాటూరు గ్రామానికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిచ్చు పెడితే సహించేది లేదని పాటూరు వైసిపి నేతలు మండిపడ్డారు. మంగళవారం పాటూరు గ్రామంలో వైసిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి నేత మల్లారెడ్డి కళ్లద్దాలు మార్చుకోవాలని మా ప్రభుత్వంలో అభివృద్ధి తెలియకుంటే తనకు కొరియర్ ద్వారా పంపిస్తున్నాం చదువుకోవాలన్నారు.

ఎంతో ప్రశాంతమైన పాటూరు గ్రామం రాజకీయ సమయాల్లో మాత్రమే ప్రత్యర్థులుగా ఉంటారని మిగిలిన సమయాల్లో గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా ఉంటామన్నారు అలాంటి గ్రామంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఘాటుగా హెచ్చరించారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదని మీ ఎమ్మెల్యే దగ్గర మార్కులు పొందేందుకు ఇష్టను సారంగా మాట్లాడుతున్నావని ధ్వజమెత్తారు. ఇంకొకసారి ఇలా మాట్లాడితే మేము సహించేది లేదని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలోఎంపీటీసీ విజయసేనారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, బైనా సురేంద్ర, జనార్దన్ రెడ్డి, వినోద్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అభయ్ రెడ్డి, వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top