బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ చేతుల మీదుగా “హ్యాపీ ఏంజిల్స్ స్కూల్” ప్రారంభం….
సాక్షిత : 125 – గాజుల రామారం డివిజన్ దేవేందర్ నగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన “హ్యాపీ ఏంజిల్స్ స్కూల్” ను బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. పిల్లల బంగారు భవిష్యత్తుకు తొలిమెట్టు ప్లే స్కూల్ లని, విద్యార్థులు ఆనందంగా విద్యను అభ్యసించడంలో హ్యాపీ ఏంజిల్స్ స్కూల్ మంచి పేరు గడించాలన్నారు.
ఈ కార్యక్రమంలో గుడ్ షేపర్డ్ స్కూల్ కరెస్పాండెంట్ కరుణాకర్, పాఠశాల కరస్పాండెంట్ జయరాం, పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, చెట్ల వెంకటేష్, చిన్నా చౌదరి, ఎండి.మసూద్, హమీద్, వాహీద్, ఆసిఫ్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
