దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న : మాజీ ఎమ్మెల్యే మెచ్చా
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గం
దమ్మపేట మండలం పాల్వంచ రోడ్ లో వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు కాంప్లెక్స్ వద్ద శివ శక్తి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, మహాఅన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుని కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. అనంతరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగ కార్యదర్శి యార్లగడ్డ శ్రీను ఇటీవలే ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట దారా యుగంధర్, రావుల శ్రీను, అబ్దుల్ జిన్నా, గాజుబోయిన ఏసు, పాకనాటి శ్రీను, తాళ్ళ వెంకటేశ్వరరావు, శేషాద్రి, రూపా రాంబాబు, చక్రాల పోలరాజు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
