తొలిసారిగా దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం పై హర్షం వ్యక్తం చేసిన : అంగన్వాడీలు
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అంగన్వాడీలకు ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు అంగన్వాడీలకు ప్రభుత్వం సెలవులు మంజూరు చేసింది. ఐసిడిఎస్ అధికారుల ప్రకారం ఈ సెలవుల సమయంలోనూ పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారాన్ని టెక్ హోమ్ పద్ధతిలో అందజేస్తారు. తొలిసారిగా అంగన్వాడీలకు దసరా సెలవులు రావడంతో సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా ఈ సెలవులు మంజూరు చేశారు. ఈ సెలవులు ప్రకటించిన ప్రభుత్వంపై అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
