భూముల సమస్యను పరిష్కరించాలని ఆదివాసీ రైతులు చేపట్టిన నిరవధిక దీక్ష : ఆరవ రోజు
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామస్తులు తమ భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీ రైతులు చేపట్టిన నిరవధిక దీక్ష ఆరవ రోజుకు చేరుకుంది. తమ పట్టా భూములను రెవిన్యూ, అటవీశాఖ అధికారులు జాయింట్ సర్వే చేసి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద దీక్ష చేస్తున్నారు. వర్షం వస్తున్న రాత్రి పూట చీకటైనా కూడా చిన్నారులతో కలిసి దీక్ష చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఇన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్న మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడంలేదు, మా సమస్యలను ఎవరూ పట్టించుకోవడంలేదు, మాకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం ఆగదని వారు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కనీసం చిన్నారులతో కలిసి రాత్రిపూట చీకట్లో ఉన్న జోరు వర్షంలో తడుస్తూ దీక్ష చేస్తున్న ఎవరూ గుర్తించడంలేదు. అని రామన్నగూడెం గ్రామస్తులంతా కలెక్టరేట్ ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
