ఎస్టి సబ్ ప్లాన్ కింద మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళ పత్రాలు లబ్ధిదారులకు : అందజేత
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం కోయరంగాపురం పంచాయతీ పరిధిలో ఐటీడీఏ ఎస్టి సబ్ ప్లాన్ కింద మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను ఈరోజు లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు సొంతఇంటి కల నెరవేర్చుకునేందుకు అవకాశం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు, పంచాయతీ సెక్రెటరీ, మరియు ఇల్లు మంజూరైన లబ్ధిదారులు పాల్గొన్నారు.
