ద్వారకా తిరుమలలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కి ఆత్మీయ సత్కారం.

Sakshitha news

ద్వారకా తిరుమలలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కి ఆత్మీయ సత్కారం.

‎ఏలూరు, : ఉదయం జంగారెడ్డిగూడెం పర్యటనకు వెళుతూ మార్గమధ్యలో ద్వారకా తిరుమల వచ్చిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు యాదవ సంఘం తరపున ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. ద్వారకా తిరుమలలోని కళ్యాణ మండపం ఆధునీకరణ పనులకు 1 కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా తమ ఆఫీసుకి రావొచ్చని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. పేద కుటుంబాలలో వివాహ శుభకార్యాలకు ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేసిన స్థానిక నేతలకు ఎంపీ అభినందనలు తెలిపారు.  ఈ సన్మాన కార్యక్రమంలో స్థానిక నేతలు ముమ్మడి చింతయ్య, ఇడా చైర్మన్ శివప్రసాద్, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్, ఇతర నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు.. ఇప్పటి వరకూ ఏ ఎంపీ కూడా చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పుట్టా మహేష్ కుమార్ కి ఏలూరు పార్లమెంట్ ప్రజలంతా రుణపడి ఉంటారని ప్రశంసించారు.