చిలుకూరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం లో విశేష పూజలు, అన్నదానం.
సాక్షిత ప్రతినిధి చిలుకూరు సూర్యాపేట జిల్లా: చిలుకూరు కాల్వొడ్డు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం లో ఆశ్వీయుజ మాసం మొదటి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య దర్శనం చేసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రత్యేక ఆకు పూజలు నిర్వహించారు. అన్నదానం చేయించిన దాతలు, వైరా వాస్తవ్యులు శ్రీ వాసిరెడ్డి కృష్ణా రావు, లావణ్య దంపతులు, వారి కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా మరియు చిలుకూరు వాస్తవ్యులు శ్రీ కొల్లు శ్రీనివాసరావు శారద దంపతులు, వారి కుమారులు కార్తీక్, కళ్యాణ్ అన్నదాతలు ప్రత్యేకంగా స్వామి వారి కి ప్రత్యేక అభిషేకాలు ఆకు పూజ లు చేసారు. తదుపరి ఆలయం ప్రాంగణంలో 41 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణము ఏర్పాటు చేశారు. చిలుకూరు వాస్తవ్యులు శ్రీ సీతారామ భక్త మండలి వారి ఆధ్వర్యంలో నర్సింహారావు వారి సంగీత బృందం, కోలాట భజన మహిళలు చేత చక్కటి సంగీతం తో హనుమాన్ చాలీసా చదవడం జరిగింది. తదుపరి స్వామి వారి విగ్రహం తో ఆటపాటలతో భక్తులు ను అలరించారు. ఆ తర్వాత ఆలయం అర్చకులు భక్తుల కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం 1 గంటకు భక్తులు కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.భక్తులు దాదాపు 600 వందల పై చిలుకు అన్ని ప్రసాదాన్ని స్వీకరించారు.ఆలయం సంప్రదాయం ప్రకారం ఆలయం అర్చకులు రజనీ కాంత్ ఆచార్య , కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదాతలు కు స్వామి వారి మెమొంటో తో సన్మానం చేసి ఆశీర్వాదం అందజేసారు.ఇట్టి కార్యక్రమం లో ఆలయం ఛైర్మన్ శ్రీ కొడారు వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, బొమ్మిరెడ్డి సమ్మిరెడ్డి, కొడారు శ్రీనివాసరావు, కట్టెకోల చంద్రయ్య, గోపయ్య, వీరభద్రం, సుశీల, దొడ్డా వెంకటి, లక్ష్మీ, రోజా భవానీ, లక్ష్మీ లావణ్య మంగమ్మ పద్మ, మరియు గ్రామం పెద్దలు ఎల్లయ్య శ్రీనివాసరావు, వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
