వాహన దారులు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించండి…. సురక్షితంగా గమ్యానికి చేరండి : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ …
సాక్షిత : ప్రజల ప్రాణాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అనే లక్ష్యంతో రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని వాహనదారులు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించి వారు సురక్షితంగా ఉండటంతో పాటు తోటి వారిని సురక్షితంగా ఉంచాలని బిఆర్ఎస్ ఎల్పి విప్,ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ఒక ప్రకటన లో తెలిపారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…..
- వాహనదారులు ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలి.
- వాహనాన్ని నడిపేటపుడు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ను తప్పని సరిగా వినియోగించాలి.
- వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపరాదు.
- వాహనాలను వేగంగా నడపడం వల్ల మీరు మాత్రమే కాదని, తోటి వాహనదారులు, పాదాచారులు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది.
కాబట్టి, ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం సురక్షితంగా తమ గమ్యానికి చేరుకోవాలన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY