ప్రకాశం
శోభాయామనంగా హనుమజ్జయంతి శోభాయాత్ర
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమిని పురస్కరించుకొని ఆదివారం త్రిపురాంతకంలోని ఆంజనేయస్వామి ఆలయంలో విశేష పూజలు మహాగణపతి పూజ శ్రీ ఆంజనేయ స్వామి వారి శ్రీ మన్యు సూక్త పారాయణ సహిత అభిషేకము నాగవల్లి దళార్చన పుష్పార్చన మంత్రపుష్పములు అందించిన తరువాత ఉదయం ఎనిమిది గంటల నుండి ఆంజనేయస్వామి ఆలయం నుండి హనుమాన్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా కనుల విందుగా భక్తి పారవశ్యంతో ఘనంగా నిర్వహించారు హనుమాన్ శోభాయాత్రను త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు ధూపాటి విశ్వనాథ శాస్త్రి జండా ఊపి ప్రారంభించారు మహిళలు హిందువులు కులాలకు అతీతంగా భారీ సంఖ్యలో ఈ శోభాయాత్రలో పాల్గొని హనుమాన్ కాషాయ ధ్వజాలను చేతభూని నుదుటన కాషాయ తిలకం దిద్ది తలకు కాషాయ రిబ్బన్లు ధరించి జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి అంటూ శోభాయాత్ర వందలాది హిందువుల నడుమ ప్రారంభమై గడపలోని కులము గడప దాటితే మనమంతా హిందువులు అంటూ కులాలకతీతంగా ప్రజలు పాల్గొని జయప్రదం చేశారు
ఆర్య వైశ్యులు మరియు పట్టణ ప్రజలు ఈ శోభాయాత్రలో అరంగేట్రం ఎగురు వేసేలా భక్తి పారవశ్యంతో దేవుడు కీర్తనలకు చిందులు వేశారు.త్రిపురాంతకం క్రింద సెంటర్ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి మొదలైన ఈ శోభాయాత్ర కేజీ రోడ్డు లోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్ళి ఆర్టీసీ బస్టాండ్ లో పుడితే పుట్టాలి హిందువుగా మన భారత దేశపు పోరునిగా అంటూ చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా కాషాయ ద్వజాలతో గుండ్రని వలయాకారంలో నిల్చొని డాన్స్ లు వేస్తూ మనసులోని భక్తిని పాట రూపంలో చూపించారు.ఆ తదుపరి గ్రామం శివారులోని పురాతన ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు శోభాయాత్ర కొనసాగింది.అక్కడ నుండి ప్రారంభం అయిన వీరాంజనేయ స్వామి దేవస్థానం వరకు హనుమాన్ శోభాయాత్ర కొనసాగింది.ఈ కార్యక్రమం లో ట్రాక్టర్ మీద 8 అడుగుల వీర హనుమాన్ విగ్రహ ప్రతిమను ఏర్పాటు చేసి డీజే సౌండ్స్ తో పట్టణం దద్దరిల్లిపోయెలా కొనసాగింది.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు దూపాటి విశ్వానారాయణ శాస్త్రి,ఆర్య వైశ్య సంఘ పెద్దలు చిన్నలు,హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ దేవాదాయ శాఖ జిల్లా సభ్యులు యామర్తి ధనుంజయరావు,ఆర్య వైశ్య నాయకులు గుడిపాటి మధు సూదనరావు,ఆర్ ఎస్ ఎస్ బాధ్యులు ఎస్ ఎస్ ఎన్ బాబు,వి హెచ్పి కందుల రమణా రెడ్డి,పూర్ణయ్య,నరసింహారావు,కాసుల సత్యం మరియు మండల ప్రజానీకం పెద్ద యెత్తున పాల్గొని జయప్రదం చేశారు.