హలియా సాక్షిత ప్రతినిధి
మానవత్వం పరిమళించిన వేళ అంటే ఇదేనేమో సమస్య ఇది అని చెబితే తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మానవత్వం చాటుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు హలియా ఎస్ఐ కాంతి కుమార్ గుర్రంపోడు మండలం, కొప్పోలు గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు చింతల శంకర్ గత సంవత్సరం కబడ్డీ టోర్నమెంట్ లో చేయికి గాయం కావడం జరిగింది. చేయికి సంబంధించిన ఆపరేషన్ చేసినప్పుడు రాడ్లు వేయడం జరిగింది. ఇప్పుడు ఆ రాడ్లను తీయడానికి సర్జరీ నిమిత్తం, 35 వేల రూపాయలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పడం జరిగింది. శంకర్ ది కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న హాలియా ఎస్ఐ క్రాంతి కుమార్ వెంటనే స్పందించి ఆపరేషన్ కి కావాల్సిన 35 వేల రూపాయలను నేను భరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే లీలావతి హాస్పిటల్ డాక్టర్ విజయ్ కుమార్ తో మాట్లాడి బెస్ట్ ట్రీట్మెంట్ అందించాలని కోరారు. కొప్పోలు కబడ్డీ క్రీడాకారులు, శెంకర్ కుటుంబ సభ్యుల తరఫున ఎస్ ఐ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఎదుటివారికి సాయం చేసే గుణాన్ని కలిగి ఉండాలని మానవత్వాన్ని చాటుకున్న రోజే మనిషి జీవితానికి సార్ధకమని, సమాజ సేవ చేయడంలో కూడా ఆనందం ఉంటుందని మానవసేవే మాధవసేవ అనే అర్థానికి నిదర్శనం ఎస్ ఐ క్రాంతి కుమార్ సమాజ సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవడం గొప్ప విషయం అని ఎస్ ఐ ని పలువురు అభినందిస్తున్నారు.