hafizpet హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధాత్రి నాథ్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది.దీనిపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించడం జరిగినది.
hafizpet ఈ సందర్భంగా అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో స్మశాన వాటిక ను అభివృద్ధి చేయాలని, కాలనీ లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరియు కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గాంధీ ని వినతి పత్రం ద్వారా కోరడం జరిగినది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ అంబేద్కర్ నగర్ కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన స్మశాన వాటిక ను త్వరలోనే అభివృద్ధి చేస్తామని, అంబేద్కర్ నగర్ కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని, స్మశాన వాటిక ను అన్ని హంగులతో సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని ,స్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తామని, స్నానపు గదులు,మంచి నీటి వసతి ,దాహన సంస్కరణ వాటిక మరియు సీసీ రోడ్లు వంటి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని,అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. త్వరితగతిన పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
అదేవిధంగా కాలనీ లో విద్యుత్ అంతరాయం కల్గుకుండా ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయాలని, అవసరమున్న చోట విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులతో ఫోన్ లో మాట్లాడినారు. , ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడలని ఎమ్మెల్యే గాంధీ అధికారులకు తెలియచేసారు . అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ,ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటానని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధాత్రి నాథ్ గౌడ్ మరియు అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు నాగరాజు, గోపాల్, కేశవ్, బాబీ, సీతారాం మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
download app