SAKSHITHA NEWS

సుఖ సంతోషాల‌తో సంక్రాంతి జ‌రుపుకోవాలి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాద‌వ్‌

వెంక‌టేష్ యద‌వ్ ను క‌లిసిన కాశీవిశ్వ‌నాధం, తోట మ‌ల్లిఖార్జున‌రావు
గుంటూరు:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఇంటింటికి నిజమైన సంక్రాంతి పండుగ సాకార‌మైంద‌ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాద‌వ్‌ చెప్పారు. టీడీపీ నాయ‌కులు తాళ్ల వెంక‌టేష్ యాద‌వ్‌ను శాలువ‌తో సత్క‌రించి సోమ‌వారం స్మైల్ ఫౌండేషన్ అధినేత గుండా కాశీవిశ్వనాథం సాక్షిత న్యూస్ ఉమ్మడి గుంటూరు జిల్లా ఇంచార్జ్ తోట మల్లికార్జునరావు, శ్రీధర్ లు క‌లిసి సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా వెంక‌టేష్ యాద‌వ్ మాట్లాడుతూ భోగ భాగ్యాల భోగి.. సుఖ సంతోషాల సంక్రాంతి.. కమ్మని వంటల కనుమ.. కలబోసి అందరి ఇంట ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్ష వ్య‌క్తం చేవారు. సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక మకర సంక్రాంతి‘ అని పేర్కొన్నారు. పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని, రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.ప్రతి కుటుంబం భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని పేర్కొన్నారు


SAKSHITHA NEWS