బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ – (BSF) వనపర్తి జిల్లా అధ్యక్షులుగా గుండ్లపల్లి రాజేష్ , కార్యనిర్వాహాక అధ్యక్షులుగా శివ
సాక్షిత వనపర్తి
బిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షులుగా గుండ్లపల్లి రాజేష్ ను కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగిందని ఈ మేరకు
(BSF) బిఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోలు రాము చేతుల మీదుగా నియామక పత్రం అంద చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు తోలు రాము ఓ ప్రకటనలో తెలిపారు
బిఎస్ఎఫ్ వనపర్తి జిల్లా నూతన అధ్యక్షులు గుండ్లపల్లి రాజేష్, కార్యనిర్వాహాక అధ్యక్షులు శివ లుమాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి జిల్లా భాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకీ కృతజ్ఞతలు తెలుపుతూ, తమ ఎన్నికకు సహకరించిన * బిఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోలు రాముకుప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా బిఎస్ఎఫ్ బలోపేతానికై క్రమశిక్షణతో బహుజన విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ప్రభుత్వ విద్యావిధానం బలోపేతానికై, పోరాటాలు చేపడతామని పత్రికా ప్రకటనలు వారు తెలియజేశారు.
