ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వాంబే గృహ సముదాయంలో రూ.37 లక్షల 50 వేల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజి( UGD) పైప్ లైన్ నిర్మాణం పనులకు తాజా మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు జలమండలి అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మెరకు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో వాంబే గృహ సముదాయంలో రూ.37 లక్షల 50 వేల రూపాయల తో UGD నిర్మాణము పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు,అత్యవసరం ఉన్న చోట , నిత్యం పొంగుతున్న ప్రాంతలలోప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి కి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ,కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
వాంబే గృహ సముదాయం కాలనీలో గల ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, నిత్యం పొంగుతుండటం వలన కాలనీ వాసులు ,ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు UGD పైప్ లైన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని, అదేవిధంగా
ప్రతి కాలనీ లో స్వచ్ఛమైన మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం ద్వారా కాలనీ వాసులకు ప్రజలకు, స్వచైమన మంచి నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని PAC చైర్మన్ గాంధీ అన్నారు.
మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, UGD పైప్ లైన్ వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని PAC చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని PAC చైర్మన్ గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది ,శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, అదేవిధంగా సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి
ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.
మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వివరాలు
- వాంబే గృహ సముదాయం కాలనీ లో రూ.37.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే (UGD) భూగర్భ డ్రైనేజి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది
పైన పేర్కొన్న UGD నిర్మాణము పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు GM హరీష్ , DGM శ్రీనివాస రాజు, మేనేజర్ ఝాన్సీ మరియు నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
