మోడీ పాలనలో మెరుగుపడిన ప్రజల జీవన ప్రమాణాలు…

Sakshitha news
  • మోడీ పాలనలో మెరుగుపడిన ప్రజల జీవన ప్రమాణాలు……………

ఉద్దెర హామీలు ఉత్తుత్తి గారెంటీలతో ప్రజల్ని మోసం చేసినతెలంగాణముఖ్యమంత్రి…………………………
స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ మెంటే పల్లి పురుషోత్తం రెడ్డి


సాక్షిత వనపర్తి :*మహాసంపర్క్అభియాన్ ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా వనపర్తి మండలంలోని పెద్దగూడెం గ్రామంలో మండల కోశాధికారి కొట్ర రాజేష్ మండల అధ్యక్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ మెంటెపల్లి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని, పలు రంగాల్లో అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ మిషన్, ముద్రా రుణాలు, గ్రామీణ రహదారుల అభివృద్ధి సహకార శాఖ ద్వారా చేనేత మత్స్య పరిశ్రమా పాడి పరిశ్రమ మరియు సింగిల్ విండో సంస్థలను బలోపేతం చేస్తూ ప్రస్తుతం కొనసాగిస్తున్న రుణాల శాతాన్ని అనేక రెట్లు పెంచుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామీణ భారత అభివృద్ధికై యుద్ధ ప్రాతిపదికన పాటు పడుతుందని పేర్కొన్నారు.

ఉద్దెర హామీలు ఉత్తుత్త గ్యారెంటీ లతో గద్దెనెక్కి 20 నెలలైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేశాడని 18 నెలలైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర నుంచి రావాల్సిన 2300 కోట్ల నిధులు ఆగిపోయాయని రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ను గెలిపించి గోసపడుతున్నారని కాంగ్రెస్ బి ఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బిజెపి పార్టీకి మద్దతుగా నిలబడడానికి గ్రామీణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అందరు సమిష్టిగా కృషి చేస్తే ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల మండల ప్రబారి బండారు కుమారస్వామి మండల అధ్యక్షుడు వెంకటేష్ మండల కోశాధికారి కొట్ర రాజేష్ శక్తి కేంద్ర ఇన్చార్జి నాగరాజు బూత్ కమిటీ అధ్యక్షులు కేశవులు బాలకృష్ణ కార్తీక్ గణేష్ మరియు గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.