పేదలకు సేవ చేయడంలోనే ఆత్మతృప్తి

Sakshitha news

పేదలకు సేవ చేయడంలోనే ఆత్మతృప్తి

** “డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ లు ప్రారంభం

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: సమాజంలోని నిజమైన పేద ప్రజలకు సేవలు చేయడంలోనే తనకు ఆత్మ తృప్తి ఉంటుందని “డాలర్స్” గ్రూపు సంస్థల అధినేత, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడ) చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. పేదలకు చేయూతను అందించాలన్న ఆశయంతో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మరో ఉచిత సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. “డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యంలో తిరుపతి రుయా ఆసుపత్రిలో ఉచిత అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం సిద్ధం చేసిన నూతన అంబులెన్స్ ను తుడా ఛైర్మెన్ మంగళవారం పరిశీలించారు. రుయా ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా అంబులెన్స్ సేవలను అందిస్తున్నామని, ఈ సేవలను ఆసుపత్రికి వచ్చేవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరో మూడు రోజుల్లో ఉచిత అంబులెన్సు సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. తిరుపతి రుయాస్పత్రికి చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన పేద రోగులే ఎక్కువ వస్తుంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో పేదలు అంబులెన్స్ కోసం మానసిక, ఆర్ధిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకే తాను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంబులెన్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చానని చెప్పారు. ఈ ఉచిత సేవలను రుయాలో పేద రోగులు వినియోగించు కోవాలని కోరారు.