ఇద్దరు కార్పొరేటర్లు, పలువురు నాయకులు కాంగ్రెస్ గూటికి…..
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి. గోదావరిఖని, : రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్‌కు చెందిన 28వ డివిజన్ కార్పొరేటర్ ధారంగుల కుమార్, 26వ. డివిజన్ కార్పొరేటర్ భగవత్ నరసింహ సారయ్య నాయక్, పార్టీ సీనియర్ నాయకుడు శివరాత్రి గంగాధర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారితో పాటు ఆయా డివిజన్లకు చెందిన పలువురు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రామగుండం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు వీటి బాలరాజు, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్, కుందనపల్లి సర్పంచ్ అరుకుటి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ నాయకత్వంలో ప్రజాసేవకు కట్టుబడి పనిచేస్తామని, ప్రజలకు మరింత చేరువగా ఉండి సేవలు అందిస్తామని వారు స్పష్టం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
