SAKSHITHA NEWS

Grand Mahapadipuja in Bejjipuram

బెజ్జిపురంలో ఘనంగా మహపడిపూజ

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని బెజ్జిపురం గ్రామంలో శనివారం ఉదయం అయ్యప్ప మహపడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ఇజ్జాడ శ్రీనివాసరావు ఇంటి వద్ద మహా పడిపూజ మహోత్సవానికి ఉత్తరాంధ్ర సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామిజీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప.. శరణంశరణం అయ్యప్ప..

స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో బెజ్జిపురం మార్మోగింది. ఈ మహపడిపూజ మహోత్స వానికి పెద్దఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మరణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ కలెక్టర్ రెడ్డి గున్నయ్య, ఎచ్చెర్ల నియోజకవర్గ బిజెపి కార్యవర్గ సభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు,బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు మేడూరి ప్రసాదరావు, గురుస్వాములు డి.వి.వి ఎస్.ఎన్ మూర్తి, బలివాడ శ్రీనివాసరావు, ఇజ్జాడ సన్యాసినాయుడు ఉన్నారు…


SAKSHITHA NEWS