పల్నాడజిల్లా
వినుకొండ రూరల్!:
📌ఉప్పరపాలెం గ్రామంలో గ్రామోదయం!
పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, మురుగునీటి పారుదల, ప్రభుత్వ పథకాల లబ్ది అంశాలు పరిశీలన!
పాల్గొన్న జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్! తహశీల్దార్ కిరణ్ కుమార్!!
ఉప్పరపాలెం లో ఈ ఉషోదయాన గ్రామోదయం కార్యక్రమం జరిగింది. పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ తహశీల్దార్ కిరణ్ కుమార్ పాల్గొని గ్రామంలో నెలకొన్న సమస్యలపై గ్రామస్థులతో చర్చించారు.
శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం , మురుగునీరు పారే దారిలేకపోవడం గమనించారు. గర్భిణీ స్త్రీలతో, బాలింతలతో, వృద్ధులతో మాట్లాడి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని హితవు చెప్పారు.
సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు గ్రామస్థులతో ప్రభుత్వ పథకాల పనితీరు పట్ల చర్చించారు.
తమ గ్రామ సమస్యలపట్ల స్పందించి గ్రామోదయం కార్యక్రమానికి ఉప్పరపాలెం గ్రామాన్ని ఎంపికచేసినందుకు జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్, తహశీల్దార్ కిరణ్ కుమార్ లను వేనోళ్ళ అభినందించి ధన్యవాదాలు తెలియజేసారు.