SAKSHITHA NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలి
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్…
సాక్షిత ప్రతినిధి కోదాడ ,సూర్యపేట జిల్లా

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందాల్ పవార్ కోరారు. బుధవారం కోదాడ మండలం తమ్మర బండ పాలెం,నల్లబండ గూడెం పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైతులు నిబంధనల ప్రకారం ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకువచ్చి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరతోపాటు, సన్న ధాన్యానికి బోనస్ పొందాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, ఈ విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దన్నారు.

కొనుగోలు చేసిన తరువాత రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు.కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సమస్య లు ఉన్నా రైతులు తమ దృష్టికి తీసుకొని వస్తే వాటిని పరిష్కరిస్తా మన్నారు.ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు ధాన్యం కేంద్రాలకు వచ్చిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.రైతులు ధాన్యాన్ని తప్పతాళ్లు లేకుండా తేమ లేకుండా తెచ్చి మద్దతు ధర పొందాలని చివరి గింజ కొనే వరకు కేంద్రాలు ఉంటాయని ఆయన తెలిపారు.అనంతరం తమ్మర బండపాలెం లోని దేవాలయాన్ని దర్శించి తీర్ద ప్రసాదాలు స్వికరించారు.ఆయన వెంట కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ,ఎంఆర్ఓ వాజిద్ అలీ,ఏ ఓ రజిని,డి టి సి ఎస్ రాంరెడ్డి తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS