SAKSHITHA NEWS

నర్సాపూర్‌ : ప్రభుత్వానికి ధాన్యం బకాయిలు చెల్లించకుండా తిరుగుతున్న రైస్‌మిల్లు వ్యాపారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సాపూర్‌ సీఐ జాన్‌వెస్లి తెలిపారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం పెద్దచింతకుంటలోని వీరభద్ర ఇండస్ట్రీస్‌, మహాలక్ష్మీ రైస్‌ మిల్లుల యజమాని నోముల పాండురంగం రూ.44.56 కోట్ల విలువైన ధాన్యం బకాయిలు ప్రభుత్వానికి చెల్లించాలన్నారు. ధాన్యాన్ని మరాడించి సీఎంఆర్‌ కింద బియ్యం తిరిగి ఇవ్వలేదన్నారు. పౌరసరఫరాల కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌ హరికృష్ణ ఫిర్యాదు మేరకు పాండురంగంపై మోసం, ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం కేసునమోదు చేసినట్లు సీఐ చెప్పారు…..