జగ్గయ్యపేట ఊర చెరువులో చేప పిల్లలను వదిలిన ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను ..
చెరువుల్లో చేప పిల్లలను వదలడం ద్వారా మత్స్యకారులకు ఆర్థిక భరోసా ఉంటుందని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు.
జగ్గయ్యపేట పట్టణం, స్థానిక చెరువు బజార్ నందు APLLIP (Andhra pradesh Livelihood Improvement Implimentation Programme) ద్వారా మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఊర చెరువులో మత్య్సశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు ఉదయభాను చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ప్రతి చెరువులో చేప పిల్లలను వదలడం ద్వారా మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. అనేక సబ్సిడీలను ఇస్తూ ఆదుకుంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా మత్స్యకారులకు ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు. వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నట్లు గుర్తుచేశారు. జగ్గయ్యపేట ఊర చెరువులో 1.18 లక్షల చేప పిల్లలను వదిలినట్లు ఉదయభాను తెలిపారు. అనుమంచిపల్లి, నవాబుపేట చెరువుతో పాటు ఇతర చెరువుల్లో కూడా వదులుతారని వివరించారు.
ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మునిసిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు , వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకరరావు , సీనియర్ నాయకులు లగడపాటి నాగేశ్వరరావు ,గుండం రంగ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మండవ శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ జాన్ బాషా, మత్స్సశాఖ డిఎఫ్ వో పెద్దిబాబు , ఏడీ (విజయవాడ) చక్రాణి , అసిస్టెంట్ ఇన్స్ పెక్టర్ లెనిన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.