SAKSHITHA NEWS

Government Whip Balka Suman’s Birthday Celebration by Chennuru Legislators at the Orphanage

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాధశ్రయంలో ఘనంగా చెన్నూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని స్పందన అనాధాశ్రమంలో చెన్నూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ గారి జన్మదిన వేడుకలు టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం హుజురాబాద్ నియోజకవర్గం నాయకులు అంబాల రాజు ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యఅతిథిగా దళిత రత్న అవార్డు గ్రహీత, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల ప్రభాకర్ (ప్రభు) హాజరై పిల్లలకు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా దళిత రత్న అవార్డు గ్రహీత, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ చెన్నూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విద్యార్థి దశ నుండే తెలంగాణ ఉద్యమాన్ని విద్యార్థులందరినీ ఏకం చేసి ప్రత్యేక తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించారు తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారి సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పెద్దపెల్లి ఎంపీగా అవకాశం ఇచ్చారు రెండో పర్యాయం టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెన్నూరు శాసనసభ్యునిగా అవకాశం ఇచ్చారు రానున్న రోజుల్లో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారి కుటుంబం ఆయురారోగ్యాలతోని చల్లగా వర్ధిల్లాలని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్పందన అనాధాశ్రమం నిర్వాహకులు గోపరాజు వీరస్వామి టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు బండారి ప్రశాంత్, ప్రముఖ గాయకుడు మిట్టపల్లి బాలు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS