SAKSHITHA NEWS

ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో దోమల నివారణ చర్యలు చేపట్టిన వెంకటేష్ గౌడ్

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా 124 డివిజన్ పరిధిలోని శంషిగుడా ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో అక్కడక్కడ వర్షపు నీరు నిలిచి దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని పాఠశాల సిబ్బంది సమస్యను స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ ఎంటమాలజీ సిబ్బందితో కలిసి పాఠశాల ఆవరణలో ఉన్న గుంతలలో దోమల నివారణ మందులు పిచికారి చేసి, లార్వా పెరగకుండా ఉండేలా మస్కిటో లార్వా సైడ్ ఆయిల్ బాల్స్ గుంతలలో వేయడం జరిగింది. కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో దోమల వల్ల డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు సోకె ప్రమాదముంది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇల్లు మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా నీటి నిలువలు ఉండకుండా చూసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా దోమలు వ్యాప్తి నివారణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఉన్న స్టికర్ లను పాఠశాల గోడలకు అతికించడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, ఎస్.సి సెల్ అధ్యక్షులు జాన్, షౌకత్ అలీ మున్నా, వాసుదేవరావు, కాసాని శంకర్, రాములుగౌడ్, మోజెస్, పుట్టం దేవి, ఆర్.పిలు స్వప్న మరియు పద్మ, రవీందర్, వెంకటకృష్ణా, బి.రవీందర్, ప్రైమరీ స్కూల్ ఎచ్.ఎం నాగజ్యోతి, ఎంటమాలజి సూపర్వైజర్ డి.నరసింహులు, ఎంటమాలజి సిబ్బంది మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS