జాతీయ శతాధిక ఉగాది కవి సమ్మేళనంలో ఘన సత్కారం పొందిన గొట్టిముక్కుల నాసరయ్య

Spread the love

జాతీయ శతాధిక ఉగాది కవి సమ్మేళనంలో ఘన సత్కారం పొందిన గొట్టిముక్కుల నాసరయ్య

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక తెలుగు అధ్యాపకులు, ప్రముఖ రచయిత జి. నాసరయ్య బుధవారం డా. బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని సి. వి. రామన్ పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ సౌజన్యంతో ఇ ఎస్ ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర జాతీయ శతాధిక ఉగాది కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు, ఈ కవి సమ్మేళనంలో పాల్గొని కవితాగానం చేసి మాతృభాష, సంస్కృతి – సంప్రదాయాల అభివృద్ధికి సాహిత్యం ద్వారా కృషి చేస్తున్న గొట్టిముక్కుల నాసరయ్యను అభినందిస్తూ జ్ఞాపిక, శాలువాతో ఘనంగా సత్కరించమని, శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ తెలిపారు, ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ – శ్రీమతి పిల్లం గోళ్ల శ్రీలక్ష్మి, శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ ఉపాధ్యక్షురాలు చిట్టే లలిత, జిల్లా కన్వీనర్ బి. వి. వి. సత్యనారాయణ మరియు జిల్లా అధ్యక్షులు నల్లా నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాసరయ్యను గురువులు, బంధు మిత్రులు తదితరులు అభినందించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page