SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 25 at 1.23.34 PM

దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ మూడోవ విడత కార్యక్రమంలో భాగంగా ఉదయం 124 డివిజన్ పరిధిలోని దత్తత్రయ నగర్ ఫేస్ 2లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. యువనేత మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా వీధులలో చెత్త వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ గుడ్ మార్నింగ్ అల్విన్ కాలనీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వారి ఇండ్లు మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని రోగాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దత్తత్రయ నగర్ ఫేస్ 2 కాలనీలో కొన్నిచోట్ల మ్యాన్ హోల్ మూతలు మార్చవలసి ఉన్నాయని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు. కాలనీలో కొంతమేర (5 మీటర్లు) డ్రైనేజీ లైన్ కలపవలసిన విషయాన్ని మరియు చుట్టుపక్కల ఎత్తు ప్రాంతాలలో ఉన్న కాలనీల నుండి వచ్చిన వర్షపు నీరు దత్తత్రయ కాలనీలోని ఒక వీధిలో నిల్వ ఉంటున్న సమస్యను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గార్ల దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, వెంకటేష్, వాలి నాగేశ్వరరావు, ఉమేష్, సంతోష్ బిరాదర్, పెంటయ్య, భాస్కర్, శ్రీనివాస్, శ్రీధర్, సత్యనారాయణ, రాంబాబు, వాసు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS