దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ మూడోవ విడత కార్యక్రమంలో భాగంగా ఉదయం 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని శివమ్మ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. యువనేత మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా వీధులలో చెత్త వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ గుడ్ మార్నింగ్ అల్విన్ కాలనీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. శివమ్మ కాలనీలో తొంభై ఐదు శాతం అభివృద్ధి పనులన్నీ పూర్తైయ్యాయని, చిన్న చిన్న సమస్యలు ఉన్నాకూడా వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు. కాలనీలో ముఖ్యంగా డ్రైనేజీ లైన్ లకు లోపలవైపు ప్లాస్టింగ్ లేకపోవడంతో మట్టి పుడుకపోయి నిండిపోతున్న విషయాన్ని మరియు మూడు చోట్ల కరెంట్ స్తంబాలు అవసరమున్న విషయాన్ని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, సిద్దయ్య, షౌకత్ అలీ మున్నా, సంగమేష్, కూర్మయ్య, సంతోష్ బిరాదర్, గిరి, జె.నరసింహ, సతీష్, చారి, మన్యం, కృష్ణ, జి.వెంకటేష్, జి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ
Related Posts
తొర్రూరు సిఐ జగదీష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
SAKSHITHA NEWS తొర్రూరు సిఐ జగదీష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు పిడిఎస్ అక్రమ రవాణా దారుడు నుంచి ఐదు లక్షల డబ్బులు డిమాండ్ చేయడంతో రెండు లక్షల తీసుకున్నారని ఆరోపణలపై తీసుకున్న ఏసీబీ అధికారులు SAKSHITHA NEWS
మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
SAKSHITHA NEWS మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే..! ఏపుగా పెరుగుతున్న పైరు పంటలపై ఇతరులు దృష్టి పడకుండా రైతులు వివిధ రకాల ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. దేవుళ్లు, సినీనటులు, జంతువులకు సంబంధించిన ఫొటోలను పెడుతుంటారు.…