SAKSHITHA NEWS

విద్యార్థులతో కలిసి ‘గాంధీ’ చిత్రం వీక్షించిన ఎమ్మెల్యే…
సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా విద్యార్థుల్లో జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించేందుకు నేడు 9వ తేదీ నుంచి 11 వరకు, 16 నుంచి 21 వరకు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో దాదాపు 22 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులకు గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో దివంగత డైరెక్టర్ రిచర్డ్ అటెన్ బరో తెరకెక్కించిన ‘గాంధీ’ చిత్రాన్ని విద్యార్థులతో కలిసి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సహా జంట సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు మంగతాయారు, ప్రశాంతి, ఎస్.హెచ్.ఓ.లు ప్రశాంత్, పవన్, సైదులు, రమణారెడ్డి, మండల రిసోర్స్ పర్సన్ రమేష్ వీక్షించారు. కాగా 1982లో విడుదలైన ‘గాంధీ’ చిత్రంతో అటెన్ బరో ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ గెలుచుకున్నారు. అకాడెమీ అవార్డుల్లో ‘గాంధీ’ చిత్రం ‘ఉత్తమ సినిమా’ సహా 8 విభాగాల్లో జయకేతనం ఎగరవేయడం విశేషం


SAKSHITHA NEWS