SAKSHITHA NEWS

Give details of Ekalavya Model Residential Schools

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ వివరాలు ఇవ్వండి – పార్లమెంట్ లో తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్న


సాక్షిత : ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ వివరాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని బ్లాక్‌లు ఏర్పాటుకు సంబంధించిన ప్రమాణాలను కలిగి ఉన్నాయా ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిస్తుందా అలా అయితే దాని వివరాలు మరియు కాకపోతే, దానికి గల కారణాలు తెలుపగలరు మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తోపాటుగా గత మూడు సంవత్సరాలలో కేటాయించిన నిధులు అలాగే ఉదయపూర్ జిల్లాలో ప్రారంభించబడిన కోసం కేటాయించిన నిధులతో పాటు రాష్ట్రం/UT వారీగా వివరాలు ఇవ్వగలరు అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నించగా కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి రేణుకా సింగ్ సమాధానమిస్తూ ఎస్టీ జనాభా 50% అంతకంటే ఎక్కువ మరియు కనీసం 20 వేల మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి బ్లాక్‌లోను ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని అలాగే 2025-26 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినదని తెలియజేసారు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒకే జిల్లా నుండి ఒకటి కంటే ఎక్కువ బ్లాక్‌లలో ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసుకొనేందుకు వెసులుబాటు ఉందని చెప్పారు. ఫలితంగా ఒక జిల్లాలో ఒకటి కంటే ఎక్కువ ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయవచ్చు అన్నారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలో మంజూరైన ఏకలవ్య స్కూళ్ల సంఖ్య వరుసగా 28 మరియు 08 అని ఈ స్కూళ్లన్నీ పని చేస్తున్నాయని నివేదించబడిందని తెలియజేసారు. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ పథకం కింద నిధులు విడుదల చేయబడిందని ఇది ఒక స్వయంప్రతిపత్త సంస్థ అని దీని ద్వారా ఏకలవ్య స్కూల్స్ నిర్మాణానికి మరియు పాఠశాలల నిర్వహణకు పునరావృతమయ్యే ఖర్చులకు వారి అవసరాలకు అనుగుణంగా నిధులను విడుదల చేస్తుందని చెప్పారు.

అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ఇఎస్ టిఎస్) పథకం కింద ప్రస్తుత సంవత్సరం మరియు గత 3 సంవత్సరాలలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.16.21* కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1200 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1057.74 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో (07-02-2023 వరకు) రూ.1465.27 నిధులు విడుదల చేయబడ్డాయని తెలియజేసారు.


SAKSHITHA NEWS