SAKSHITHA NEWS

గండ్ర దంపతుల ఆదేశాలతో
సాక్షిత : హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం. మండల కేంద్రంలో శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపుమేరకు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తహాసము భాగంగా నిర్వహించే రోజు వారి కార్యక్రమాల అనుగుణంగా. ఈరోజు వన. మహోత్సవం. మొక్కలు నాటడం ఫ్రీడమ్ పార్క్ అన్ని గ్రామాలలో పట్టణాలలో స్థానిక సంస్థ లో మొక్కలు నాటడం ప్రారంభించగా శాయంపేట మండల కేంద్రంలో బతుకమ్మ ఆటస్థల. ప్రాంగణం నందు శాయంపేట గ్రామ సర్పంచ్ కందగట్ల రవి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం ప్రారంభించగా దీనికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పర్యావరణ సమతుల్యం కాపాడడంలో ఎంతో పురోగతిని సాధించిందని ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా బాధ్యత యుతంగా నిర్మిస్తున్నానని తెలియజేశారు ఒకప్పుడు ముండ్ల పొదల్లో చెత్తాచెదారాలతో నిండి ఉన్న స్థలాలు నేడు ప్రతి గ్రామం పట్టణం అనే తేడా లేకుండా పచ్చదనంతో చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం లో ఉన్నాయని తెలియజేశారు పల్లె పట్టణం తేడా లేకుండా పచ్చదనం పెరిగి స్వచ్ఛమైన ప్రాణవాయువు అందుతుందని తీరొక్క మొక్కలతో. రూపుదిద్దుకున్న పల్లె ప్రకృతి వనాలు ప్రజలకు. ఆహ్లదకర వాతావరణ. అందించడమే గాక గ్రామాలకు కొత్తదనం తెచ్చాయని అన్నారు ఇలాంటి పచ్చదనం వల్ల ఈనాడు వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురుస్తున్నాయని తెలియజేశారు మన మహోత్సవం మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కందగట్ల రవి వైస్ ఎంపీపీ రామ్ శెట్టి లతా లక్ష్మణ్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్ ఎంపీడీవో కృష్ణమూర్తి మరియు గ్రామపంచాయతీ కార్యదర్శి టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు మరియు టిఆర్ఎస్ పార్టీ మామిడి అశోక్ పాల్గొన్నారు


SAKSHITHA NEWS