SAKSHITHA NEWS

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమైంది : ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి *
సాక్షిత : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన జీవోను ఇటీవలే ప్రభుత్వం విడుదలతో పాటు.. సచివాలయ ఉద్యోగుల పే స్కేల్ ఖరారు చేసిన నేపథ్యంలో నరసరావుపేట పట్టణంలోని భువన చంద్ర టౌన్ హాల్లో థ్యాంక్యూ సీఎం సార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి , ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి , మున్సిపల్ కమిషనర్ రవీంద్ర , పాల్గొన్నారు

ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి.. కేవలం 4 నెలల్లోనే వాటి భర్తీ ప్రక్రియను పూర్తి చేశారని వివరించారు. ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల ప్రకారం అర్హులైన వారికి జూన్‌ నెలాఖరు కల్లా ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి, జూలై నెల(ఆగస్టు 1న చెల్లించే)కు పెరిగిన జీతాలు అమలు చేయాలని సీఎం జగన్‌ ఈ ఏడాది జనవరిలోనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. సచివాలయం సిబ్బంది కూడా అందరూ కష్టపడి పనిచేస్తూ.. పాలనలో నూతన ఒరవడి సృష్టించారని ప్రశంసించారు. అక్కడి సమస్యలను అక్కడే పరిష్కరిస్తూ.. ఇబ్బందులు లేకుండా చేస్తున్నారని అభినందించారు. ఇచ్చిన మాట నెరవేర్చిన వ్యక్తి జగన్ … ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేసి అందరినీ అయోమయంలో పడివేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారని.. అందరూ కష్టపడి 2024లో జగన్ ని సీఎం చేయాలని అన్నారు.

కార్యక్రమంలో ఇంజినీర్ కమలాకర్ రెడ్డి , బిల్డర్ నరసింహ రెడ్డి , షేక్ కార్పొరేషన్ ఛైర్మన్ ఖాజా వలి మాస్టర్ , రొంపిచర్ల జెడ్పీటీసీ పిల్లి ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS