SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 07 at 10.02.06 PM

ఇక సెలవు🙏🏻. ముగిసిన గద్దర్ అంత్యక్రియలు..

హైదరాబాద్ :

విప్లవ గొంతుక, ప్రజా యుద్ధ నౌక గద్దర్ శకం ముగిసింది. తన పాటలతో ఎంతో మందిని ఉర్రూతలూగించిన గొంతు పూర్తిగా మాగబోయింది. అనారోగ్యం కారణంగా ఆదివారం మృతిచెందిన గద్దర్ అంత్యక్రియలు అల్వాల్‌లోని మహాబోధి పాఠశాల గ్రౌండ్‌లో సోమవారం ముగిశాయి. బౌద్ద మత పద్దతుల్లో గద్దర్ అంతిమసంస్కారాలు నిర్వహించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గద్దర్‌కు నివాళులు అర్పించారు.

ప్రజా యుద్ధనౌకకు కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున కవులు, రచయితలు, సినీ, రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు అంత్యక్రియలకు హాజరయ్యారు. దీంతో మహాబోధి స్కూల్ పరిసర ప్రాంతాలు జనసంద్రోహంగా మారాయి. అభిమానులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు భారీ ఎత్తున నిర్వహించారు. పాటే ప్రాణంగా బతికిన గద్దర్ గొంతు మూగ బోవడంతో కడసారి ఆయన చూసి అక్కడ వచ్చినవారు శోకసంద్రంలో మునిగిపోయారు.

కాగా, అంతకుముందు ప్రజా గాయకుడు గద్దర్ పార్థివదేహనికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. సోమవారం అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి సీఎం ప్రగాఢ సానూభూతి తెలిపారు. గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అంతకముందు ఎల్బీ స్టేడియం నుండి మధ్యాహ్నం గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం అయ్యింది.

ఈ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుండి సికింద్రాబాద్ మీదుగా అల్వాల్‌లోని గద్దర్ నివాసం వరకు సాగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన గద్దర్ అంతిమయాత్రలో కళాకారులు, రచయితలు, కవులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు పలువురు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ను కడసారి చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు..


SAKSHITHA NEWS