SAKSHITHA NEWS

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం మరియు సాయి ఐశ్వర్య కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లలో నెలకొన్న పలు సమస్యలు
సాక్షిత : చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై మాజీ కార్పొరేటర్ సాయి బాబా గారు,GHMC ఇంజనీరింగ్ విభాగం, జలమండలి అధికారులతో కలిసి కాలనీల లో పాదయాత్ర చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాయదుర్గం మరియు సాయి ఐశ్వర్య కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ,సమస్యలను పరిగణలోకి తీసుకోని ,వారి విజ్ఞప్తి మేరకు ఈ రోజు కాలనీల లో పాదయాత్ర చేపట్టడం జరిగినది అని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత , సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.అదేవిధంగా కాలనీ లో రోడ్లు మంజూరి అయినవి అని ,త్వరలోనే అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల ను వేస్తామని, పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని , మంజూరి అయిన పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. కాలనీ లలో అవసరమున్న చోట డ్రైనేజి ని పునరుద్దరిస్తామని, పారిశుధ్య నిర్వహణ సరిగ్గా చేయాలని పారిశుద్ధ్య నిర్వహణ పై అలసత్వం వద్దు అని, వర్షకాలం లో కాలనీలను పరిశుభ్రంగా ఉంచాలని
ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీలలో క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు,అక్కడికి అక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించడం జరిగినది.అదేవిధంగా కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని మరియు . ముఖ్యంగా డ్రైనేజి, మంచి నీరు , రోడ్లు , వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంభందిత సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకరావడం జరిగింది అని.సమస్యలపై ప్రభుత్వ విప్ గాంధీ సానుకూలంగా స్పందించి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు,విద్యుత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.
,మెరుగైన జీవన ప్రమాణాలకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు అదేవిధంగా గచ్చిబౌలి డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో GHMC DE విశాలాక్షి , AE జగదీష్ ,వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, జలమండలి మేనేజర్ నరేందర్ , SRP కిష్టయ్య మరియు గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు శ్రీను పటేల్, నాయి నేని చంద్రకాంత్ రావు,పద్మారావు, నరేష్, సంపత్, సతీష్ ముదిరాజు, శ్రీకాంత్,సుధీర్, గోవింద్, అక్బర్ ,సల్లావుద్దీన్, అజిమ్,లియకాత్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS