From monarchy to democracy
రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ హోటల్ సర్కిల్ నుండి MG రోడ్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు, అమీర్ పేట డివిజన్ లోని కనకదుర్గమ్మ దేవాలయం నుండి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వరకు వజ్రోత్సవ వేడుకలలో భాగంగా భారీ ర్యాలీ ని మంత్రి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ ర్యాలీలో MLC సురభి వాణి దేవి, కార్పొరేటర్ లు హేమలత, మహేశ్వరి, కొలన్ లక్ష్మీ, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, ఉప్పల తరుణి, RDO వసంత, DEO రోహిణి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తో పాటు, వివిధ పాఠశాల లకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గాంధీ విగ్రహం వరకు చేరుకున్న తర్వాత గాంధీ విగ్రహం వద్ద పూలు సమర్పించి మంత్రి నివాళులు అర్పించారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశం గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవ వేసుకలను వైభవంగా నిర్వహించిందని తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో మనం ప్రత్యేక దేశంలో ఉండేవారమని, నాటి ప్రజలు చేసిన అనేక పోరాటాలు, అనేకమంది ప్రాణ త్యాగాల ఫలితంగా 1948, సెప్టెంబర్ 17 న భారతదేశం లో కలవడం జరిగిందని, వివరించారు.
తెలంగాణ ప్రాంతం భారతదేశం లో విలీనమై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ స్ఫూర్తి ని చాటే విధంగా 16,17,18 మూడు రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 16 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ర్యాలీలతో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 17 వ తేదీన NTR స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి KCR ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరవుతురని చెప్పారు.
అన్ని వర్గాలAప్రజలకు సమన్యాయం జరగాలనే పట్టుదలతో డాక్టర్ BR అంబెడ్కర్ రచించిన భారత రాజ్యాంగం తో విద్య, ఉద్యోగం, రాజకీయాలలో రిజర్వేషన్ లు లభిస్తున్నాయని, ఉన్నతమైన పదవులకు చేరుకోగలిగారని పేర్కొన్నారు. అలాంటి గొప్ప నాయకుడు అంబెడ్కర్ పేరు తెలంగాణ సెక్రెటరియేట్ కు పెట్టడం నిజంగా మనందరికీ ఎంతో గర్వకారణం అన్నారు. ఇది ముఖ్యమంత్రి కి బడుగు, బలహీన వర్గాల ప్రజల పట్ల ఉన్న దార్శనికతకు నిదర్శనం అన్నారు. నాటి ఉద్యమకారుడు, నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆదర్శ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచి గా నిలిచిందని చెప్పారు.