SAKSHITHA NEWS

తెలంగాణ:

 హైదరాబాద్‌లో ఉచిత పార్కింగ్‌ రుసుము అంశాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సీరియస్‌గా తీసుకున్నారు. ఈ రుసుము విధానాన్ని కొన్ని థియేటర్ల యాజమాన్యాలు ఉల్లంఘిస్తున్నాయని కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఆమ్రపాలి నగరంలోని థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో అధికారులతో తనిఖీ చేయించారు. కూకట్ పల్లి, ఆర్టీసీ క్రాసురోడ్డు, సికింద్రాబాద్, ప్రాంతాల్లోని థియేటర్లలో అక్రమ పార్కింగ్‌ వసూళ్లు చేస్తున్నట్లు బయటపడింది. ఆయా యాజమాన్యాలు సింగిల్ స్క్రీన్ కలిగిన కేటగిరీలో నమోదై, మూడు, నాలుగు స్క్రీన్‌లు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఇలా నిబంధనలు పాటించని వారిపై కఠినచర్యలు తీసుకుంటామని.. థియేటర్లలో నాసిరకం ఆహార పదార్థాలు గుర్తించి నోటీసులు ఇచ్చామని కమిషనర్‌ తెలిపారు.కొన్ని మాల్స్ థియేటర్లు, మల్టీ ప్లెక్స్‌లలో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమ్రపాలి హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తనిఖీలలో నిబంధనలను పాటించని మాల్స్‌కు, మల్టీప్లెక్స్‌లకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశారు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లు, పెద్ద పెద్దా షాపింగ్ మాల్స్‌లో మొదటి అరగంట ఎలాంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దన్నారు...

SAKSHITHA NEWS