SAKSHITHA NEWS

సీఎం రేవంత్‌రెడ్డిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కలిశారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసి చర్చలు జరిపిన నేపథ్యంలో నేడు సీఎంను కలిసి ఆయనతో బ్రేక్ ఫాస్ట్ చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కొద్ది రోజుల క్రితం హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇటీవల ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తిరిగి ఆయన బీఆర్ఎస్ లోకి వెళతారన్న జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని భేటీ కావడంతో ఆయన కాంగ్రెస్


SAKSHITHA NEWS