గాజులరామారం డివిజన్‌లో రూ.79 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

Sakshitha news

గాజులరామారం డివిజన్‌లో రూ.79 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

కుత్బుల్లాపూర్: గాజులరామారం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో రూ.79 లక్షల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేశారు. శ్రీ వెన్ ఎంక్లేవ్‌లో రూ.38 లక్షలు, సరస్వతి ఆర్కేడ్‌లో రూ.20 లక్షలు, మెట్కన్ గూడలో రూ.21 లక్షల నిధులతో
మొత్తంగా ఈ పనులను చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కృషి చేస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే నియోజకవర్గంలోని వివిధ కాలనీల్లో కోట్లాది రూపాయలతో అంతర్గత డ్రైనేజీలు, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనూ అదే తరహాలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

గత పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని కూన శ్రీశైలం గౌడ్ గారు విమర్శించారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా నాయకులు కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నారని ఆరోపించారు.

ఈ ప్రాంతాల అభివృద్ధికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు కి కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్‌గిరి డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ , స్థానిక కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్‌తో పాటు కాలనీ అధ్యక్షులు మరియు సభ్యులు శ్రీధర్ గౌడ్, సోమరాజు, రాజశేఖర్ రెడ్డి, కేశవ రెడ్డి,విజయ్ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సునీల్, భూపాల్ రెడ్డి మరియు కాలనీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top