తెలంగాణ లో అధికార కాంగ్రెస్ పార్టీ దాస్టికం బీజేపీ నాయకుల అక్రమ అరెస్ట్ లు
సేవ్ హైదరాబాద్ చలో సెక్రటేరియట్ ముట్టడి కి రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు ముందస్తు గా దుండిగల్ మున్సిపల్ బీజేపీ నాయకుల అరెస్ట్ చేయడం జరిగింది
అరెస్ట్ చేసిన వారిలో మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి,జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గోనె మల్లారెడ్డి, మున్సిపల్ కోశాధికారి కొమ్ము ప్రశాంత్ తదితరులున్నారు
బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు పెనం మీదకేని పొయ్యిలో పడ్డట్టు అయింది పరిపాలన చేతగాని పాలకులు ప్రశ్నించే ప్రతిపక్షపార్టీ నాయకుల అరెస్ట్ చేయడం సరికాదు ప్రశ్నించే గొంతును నొక్కివేయడం ప్రజాస్వమ్యాన్ని కూనీ చేయడమే
రాష్ట్రం లో యూరియా అందక ఒకదిక్కు రైతుగోస, ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రజల ముందు తిరగడానికి మొహంలేక, ఇందిరమ్మ ఇండ్ల బాధితుల గోస ఒక దిక్కు పేద వృద్ద,వితంతు, వికలాంగులకు నూతన పెన్షన్ ఇవ్వకుండా తాత్సారం చేయడమే కాక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక సమస్యలపై నేడు భారతీయ జనతా పార్టీ సెక్రటేరియట్ కు పిలుపు ఇస్తే బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్ లు తీవ్ర అన్యాయం ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే త్వరలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన వస్తుందని హెచ్చరించారు
