290 సుభాష్ నగర్ డివిజన్‌లో స్థానిక సమస్యలపై అధికారుల పర్యటన
290 సుభాష్ నగర్ డివిజన్‌లో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ , కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ , కొంపల్లి కమిషనర్ , మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు , సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు నాగిరెడ్డి , సాయిబాబా నగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి , సుభాష్ నగర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు తులసి , కొమురయ్య , సాలోమని కలిసి డివిజన్‌లో పర్యటించడం జరిగింది.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, CC రోడ్లు, UGD పనులు, పారిశుద్ధ్య సమస్యలు, స్ట్రీట్ లైట్ల సమస్యలు తదితర అంశాలపై అధికారులకు వివరించడం జరిగింది.
ప్రజలకు మౌలిక వసతులు అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యం.
ప్రజల కోసం నిరంతరం ముందుండి పనిచేస్తాం

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
