292 సాయిబాబా నగర్ డివిజన్ – సూరారం కాలనీ, కృషి కాలనీ, పుష్పగిరి బస్తీ

Sakshitha news

292 సాయిబాబా నగర్ డివిజన్ – సూరారం కాలనీ, కృషి కాలనీ, పుష్పగిరి బస్తీలలో BRS నాయకుల పాదయాత్ర

292 సాయిబాబా నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ, కృషి కాలనీ, పుష్పగిరి బస్తీ లలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే K.P.వివేకానంద్ గౌడ్ సూచనల మేరకు BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ మరియు రాజ్ కుమార్ ముదిరాజ్ పాదయాత్ర నిర్వహించారు.

ఈ పర్యటనలో ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, శానిటేషన్ మరియు ఇతర మౌలిక సదుపాయాల గురించి స్థానికులతో చర్చించారు.

ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించి, డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో BRS నాయకులు కిషోర్ ముదిరాజ్, పూర్ణచందర్ రెడ్డి, బైరిష్ గౌడ్, సీతారాం, రెహమాన్, శ్రీనివాసరావు, బాగారెడ్డి, భాస్కర్, కిరణ్, PR.సీతారాం, చందన్, ప్రసాద్, P.R.సురేష్ కుమార్, బిక్షపతి, మల్లారెడ్డి, పుష్పగిరి బస్తీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, గుడి శీను, లచ్చిరెడ్డి, జనార్ధన్ తదితరులు, కాలనీ సంఘ సభ్యులు, మహిళలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Scroll to Top