తెలంగాణ ఉద్యమ ఆశయాలు ప్రజలకు దక్కలేదు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నేను జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్ మరియు షాపూర్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్రంలోని ప్రజలంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే రాష్ట్రమొచ్చినాక కేవలం కొంతమంది మాత్రమే లబ్ధి పొందారని కోట్లాదిమంది ప్రజానీకం ఇంకా కష్టాల్లోనే ఉన్నారని అన్నారు. నీళ్లు, నిధులు,నియామకాలు అనే నినాదం తో కొనసాగిన తెలంగాణ ఉద్యమం ఆనాడు విద్యార్థులు మరియు కార్మిక లోకమంతా స్వచ్ఛందంగా నిరవధిక సమ్మెలో పాల్గొని అరెస్టులకు, జైలుకు వెనకాడక పోరాటం చేస్తే నేడు ఆ ఉద్యమకారులను గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం హామీలకు మాత్రమే పరిమితమైందని,ఏ బూర్జవా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఎలాంటి లాభం జరగదని ఎందుకంటె ఆయా రాజకీయ పార్టీలో వ్యాపారులు, దోపిడిదారులు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడమే కారణమని కావున నిత్యం ప్రజల కోసం పోరాటం చేసే కమ్యూనిస్టులను ఎన్నుకుంటే ప్రజల సమస్యలు తిరుతాయని అన్నారు.
దానికి నిదర్శనమే మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు పెంపు అని దానికోసం ఇప్పుడున్న ఏకైక కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే కోణంనేని సాంబశివరావు నిత్యం అసెంబ్లీలో మాట్లాడడమే కారణమని కానీ బి ఆర్ ఎస్, బిజెపి, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఎవరు కార్మికుల జీతభత్యాల గురించి మాట్లాడకుండా రాజకీయం చేశారని దీన్ని గమనించిన ప్రజలు రానున్న రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ నాయకులను శాసనసభ మరియు పార్లమెంట్ లకు పంపించాలని కోరారు.
ఈ కార్యక్రమాలలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి హరినాథ్ రావు రాములు జిల్లా కౌన్సిల్ సభ్యుడు నరసింహారెడ్డి ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబు, కోశాధికారి సదానంద్ శాఖ కార్యదర్శి సహదేవ రెడ్డి, బక్కరి మల్లేష్, ముసలయ్య, సిపిఐ నాయకులు రవి, సామెల్, వెంకటేష్, భీమేష్, ఇమామ్, యాదగిరి, ఆశయ, శేఖర్, సత్తిరెడ్డి ,ప్రసాద్ నాయక్ ప్రవీణ్, నవీన్, నర్సిరెడ్డి పాటు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
