20 వార్డు ఎన్నికల ప్రచారంలో…..నుగులాపును కలిసిన ఎమ్మెల్యే నాని…
-నాడు వైయస్సార్ తరహాలో…..సీఎం జగన్ ప్రజలకు ఎంతో మంచి చేస్తున్నారు….. ఎమ్మెల్యే నానికు తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్న -మాజీ చైర్మన్ నుగలాపు
-మంచి బలమైన ముద్ర ఉన్న నాయకుడు నుగులాపు ఆశీస్సులు…. నా గెలుపుకు నాంది అవుతాయి
-నాడు చైర్మన్ గా నుగలాపు సహకారంతో….. ఎమ్మెల్యేగా గుడివాడలో అనేక ప్రజాసమస్యలు పరిష్కరించాను
గుడివాడ 20వ వార్డు ఆటోనగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని మున్సిపల్ మాజీ చైర్మన్ నూగలాపు వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానికు…. మాజీ చైర్మన్ నుగులాపు వెంకటేశ్వరరావు తన సంపూర్ణ మద్దతు తెలియజేశారు. నాడు వైయస్సార్ మాదిరిగానే…. నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమానికి ఎంతో మంచి చేస్తున్నారని నుగలాపు వెంకటేశ్వరరావు కొనియాడారు. ప్రధానంగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి పేదలకు నాణ్యమైన విద్యను అందుబాటులో తీసుకొస్తు సీఎం జగన్ తీసుకున్న చర్యలు ఎనలేనివని నుగలాపు కొనియాడారు. ప్రజలందరికీ మంచి జరగాలంటే ఎమ్మెల్యేగా కొడాలి నానిను…. సీఎంగా జగన్మోహన్ రెడ్డిని తిరిగి గెలిపించుకోవాలని నుగలాపు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ వ్యక్తిగతంగా త్రాగునీరు అందజేయడమే కాక, గుడివాడ ప్రజల సంక్షేమానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు.చైర్మన్ గా గుడివాడ అభివృద్ధికి పాటుపడడమే కాక, అనేక పోరాటాలు చేసి ప్రజల అవసరాలను తీర్చడంలో నుగలాపు చేసిన కృషి ఎనలేనిదన్నారు.
ఆయనను ఆదర్శంగా తీసుకునే… నేను వ్యక్తిగతంగా ప్రజలకు త్రాగునీరు అందించేందుకు ట్యాంకర్లు ఏర్పాటు చేశానని కొడాలి నాని తెలియజేశారు. నుగులాపు స్పూర్తితో ప్రజలకు దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. నుగలాపు చైర్మన్ గా ఉన్న సమయంలో ఆయన సహకారంతో గుడివాడ సమస్యలను….. అప్పటి సీఎం వైఎస్ఆర్ దృష్టికి తీసుకెళ్లమన్నారు. మా ప్రయత్నానికి స్పందించిన వైయస్సార్ గుడివాడలో 106 ఎకరాల త్రాగునీటి చెరువు ఏర్పాటు, పేదలకు ఇల్లు పట్టాలు, బైపాస్ రోడ్డు విస్తీర్ణం తదితర అనేక సమస్యలను పరిష్కరించారని నాటి విషయాలను ఎమ్మెల్యే కొడాలి నాని వివరించారు. గుడివాడలో బలమైన ముద్ర ఉన్న నుగలాపులాంటి నాయకుడు జగన్ ప్రభుత్వానికి… నాకు మద్దతుగా నిలవడం శుభ పరిణామం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొంటూ…. నుగలాపు వెంకటేశ్వరరావుకు…. చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేశారు.