SAKSHITHA NEWS

పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ

ముల్పూరి నారాయణ ,చల్లపల్లి రాధమ్మ లకు నివాళ్లు అర్పించిన మాజీ ఎంపీ నామ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, సాక్షిత:

ఖమ్మం పట్టణానికి చెందిన ముల్పూరి నారాయణ ఇటీవల మరణించగా నగరం లోని బాలాజీ నగర్ నందు ఉన్న వారి నివాసానికి బీ.ఆర్.యస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు వారి ఇంటికి వెళ్లి వారి కుమారుడు ప్రవీణ్, కుమార్తె ప్రశాంతి తో పాటు వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. అలానే ఇటీవల శాస్త్ర చికిత్స చేయించుకుని అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న డా.వైవీ రామారావు ను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్ ఆంధ్రజ్యోతి, డాక్టర్ మిక్కిలినేని విజయకుమార్ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండాకు చెందిన చల్లపల్లి రాధమ్మ ఇటీవల మృతి చెందగా వారి నివాసానికి వెళ్లి రాధమ్మ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం, రాధమ్మ కుమారులు సత్యనారాయణ, సీతారామయ్య, నాగేశ్వరరావు, దేవేందర్ రావు, శ్రీనివాసరావు, మనవడు చల్లపల్లి రవితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి నామ తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నామ వెంట కనకమేడల సత్యనారాయణ, నాదెండ్ల సుధాకర్, మొండితోక జయకర్, రావూరి శ్రీనివాసరావు, బాణాల వెంకటేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, కర్నాటి శ్రీను, కొటారి రాఘవరావు, వాకదాని కోటేశ్వరరావు, అబ్బూరి రామన్, నామ సేవా సమితి సభ్యులు పాల్వంచ రాజేష్, తాళ్లూరి హరీష్ బాబు, కృష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS